మీగ‌డ రుచిగా ఉండ‌ట‌మే కాదు.. అందానికీ ఆరోగ్యానికి కూడా మంచిది.

మీగ‌డ రాయ‌డం వ‌ల్ల రంధ్రాల్లో పేరుకున్న దుమ్ము, మృత‌క‌ణాలు తొల‌గి చ‌ర్మం ఆరోగ్య‌వంతంగా, మృదువుగా త‌యార‌వుతుంది.

ఓట్స్ లేదా బ్రెడ్డు పొడి క‌లిపి కాళ్లూ, చేతుల‌కు రాసి చల్ల‌టి నీళ్ల‌తో క‌డిగేస్తే మంచి ఫ‌లితాలిస్తాయి.

మోకాళ్లు, మోచేతులు, మెడ భాగాలు ఛాయ త‌క్కువ‌గా ఉంటాయి.

మీగ‌డ ప‌ట్టిస్తే ఆ భాగాలు కూడా చ‌క్క‌గా అవుతాయి.

ఎండ వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌బ‌డినా, క‌మిలినా మీగ‌డ‌తో త‌గ్గించుకోవ‌చ్చు.

 డ్రై స్కిన్ ఉన్న‌వారు వారానికోసారి ముఖానికి మీగ‌డ రాసి పావుగంట త‌ర్వాత గోరువెచ్చ‌టి నీటితో క‌డిగేయండి.

మీగ‌డ‌, శ‌న‌గ‌పిండి స‌మ‌పాళ్ల‌లో క‌లిపి ప్యాక్ గా వేసుకుంటే ముఖం తేట‌గా ఉంటుంది.

ప‌సుపు క‌లిపి రాసినా మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది.

చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌టం, కంటి కింది వ‌ల‌యాలు జుట్టు రాల‌డం లాంటి వాటిని మీగ‌డ నివారిస్తుంది.