చిన్నపాటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తే హాయిగా, ప్రశాంతమైన నిద్ర మీకు దక్కుతుంది.

కిడ్నీల్లో రాళ్లు 

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు.. క్యాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.

మలబద్దక సమస్య

రోజూ వంటల్లో గసగసాల్ని వాడడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. 

శ్వాస సంబంధిత సమస్యలు

శ్వాస సంబంధిత సమస్యలు కూడా గసగసాలతో తొలిగిపోతాయి. అస్తమా, దగ్గు ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి.

గుండె సమస్యలు 

గుండె సమస్యలు ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, చక్కెర కలుపుకొని ఉదయం సాయంత్రం, అరచెంచాడు తీసుకుంటే గుండెపనితీరు మెరుగుపడుతుంది.

వేడి ఎక్కువగా ఉంటే 

గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే ఉపశమనం పొందొచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాల్ని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.