కడుపు ఉబ్బరం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.
కడుపు ఉబ్బరం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.
ఉబ్బరం వలన కడుపులో మందంగా అనిపించడం, నొప్పి, మలబద్ధకం ఇబ్బంది పెడుతాయి.
కడుపు ఉబ్బరం సమస్యకు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉటుంది.
ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి.
నమిలి తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేం. దీంతో ఉబ్బరాన్ని అరికట్టవచ్చు.
పాల పదార్థాలు ఓ పట్టాన అరగవు. ఉబ్బరం సమస్య ఉన్నవాళ్లు వీటిని తగ్గించుకోవాలి.
టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీళ్లలో కలిపి పరగడుపున తాగాలి.
గ్రీన్‌టీ లేదా తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల కూడా ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు.
కడుపు మరీ ఉబ్బరంగా అనిపిస్తే సోడియం బై కార్బొనేట్ మాత్రలు వేసుకోవచ్చు. మోతాదుకు మించితే ప్రాణాంతకం.
ఉబ్బరానికి కారణమైన పదార్థాల్లో లవణం ప్రథమ స్థానంలో ఉంటుంది.
ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తప్పించు కోవచ్చు.