రెండు రోజుల్లో ఎన్ని సినిమాలు ఓపెనింగ్ అయ్యాయో..

ఆగస్టు 22,23 ఈ రెండు రోజులు ముహుర్తాలు బాగుండటంతో టాలీవుడ్ చిన్న, పెద్ద చాలా సినిమాలు ఓపెనింగ్స్, పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి.

అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా పూజా కార్యక్రమం ఆగస్టు 22న జరిగింది

నాగశౌర్య కొత్త సినిమా కూడా రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆగస్టు 22న లాంచ్ అయింది.

అల్లరి నరేష్, నాంది డైరెక్టర్ కాంబినేషన్లో రానున్న 'ఉగ్రం' సినిమా కూడా  ఆగస్టు 22న పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

డ్యాన్స్ మాస్టర్ జాని, ఆర్టిస్ట్ వికాస్ వసిష్ఠ హీరోలుగా  'యథారాజ తధాప్రజా' సినిమా కూడా ఓపెనింగ్ జరిగింది.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కీడా కోలా' ఆగస్టు 23న పూజా కార్యక్రమం జరుపుకుంది.

మరో చిన్న సినిమా ఎన్త్ హావర్, ఆర్టిస్ట్ గౌతమ్ రాజు తనయుడు హీరోగా ఒక సినిమా ప్రారంభమైంది. ఇవే కాక మరిన్ని చిన్న సినిమాలు కూడా ఈ రెండు రోజుల్లో ప్రారంభమయ్యాయి.