అందంగా కనిపించే కింగ్‭ఫిషర్ పక్షిని గుడ్డులోంచి బయటికి వచ్చినప్పుడు చూస్తే ఎవరైనా భయపడతారు. అయితే ఇవి పెరుగుతన్నా కొద్ది అందంగా మారుతుంటాయి. బుల్లెట్‭లా దూసుకెళ్లి చేపల్ని పట్టే ఈ పక్షి గురించి కొన్ని సంగతులు తెలుసుకుందామా?

అందంగా ఉండే ఈ కింగ్‌ ఫిషర్స్‌ జాతి పక్షుల్లో 114 రకాలు ఉంటాయి.

అతి పెద్ద కింగ్‌ ఫిషర్‌ పక్షి ఆస్ట్రేలియాలో ఉంటుంది. బరువు 500 గ్రాములు. దానిపేరు కూకబుర కింగ్‌ ఫిషర్‌.

ఇవి చేపలను ఎక్కువగా తినవు. ఎప్పుడోసారి మాత్రమే చేపలు తింటాయి. చలికాలమంతా కలిపి 15 చేపలకంటే ఎక్కువ తినవు.

బుల్లెట్‌లాగా నీళ్లలోకి దూసుకుని పోయి చేపలను పట్టేస్తాయి. కళ్లు చురుగ్గా ఉంటాయి. మెడ కండరాల ఫ్లెక్సిబిలిటీ అద్భుతం.

నదీ తీరాల్లో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు దొర్లుతుంటే ఇవి డిప్రెషన్‌కు లోనవుతాయి. అయితే వాటికి అడ్డుగా వేరే వస్తువులు మాత్రం ఉంచవు.

గుడ్లలోంచి బయటకొచ్చిన ఈ పక్షి పిల్లలను చూసి భయపడతాం. కనుక్కోలేం. పెరిగే కొద్దీ అందంగా తయారవుతాయి.

మగవాటికంటే ఆడపక్షులు మరింత అందంగా ఉంటాయి.

తక్కువ ఎత్తులో బుల్లెట్స్‌లా గాలిలో దూసుకుపోయే ఈ పక్షులు గంటకు 25 మైళ్లు వెళ్తాయి. రెక్కలతో ముక్కుకూ ఈ వేగంతో సంబంధం ఉంది.

చలికాలంలో నీళ్లు గడ్డకట్టని ప్రాంతాలకు వలసవెళ్తుంటాయి.