ప్రపంచంలోనే అవినీతి తక్కువగా ఉండే దేశాల్లో న్యూజీలాండ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. అలాగే ఈ దేశంలో అసలు పాములే ఉండవు. అలాగే మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్న తొలి దేశం కూడా ఇదే. ఇంకా మరిన్ని ప్రత్యేకతలు చూసేద్దాం..

ప్రపంచంలోనే అతి పొడవైన స్థలం పేరు ఇక్కడే ఉంది. దీని పేరు "Taumatawhakatangihangaoauauotameteaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu ". ఈ పదంలో 85 అక్షరాలున్నాయి. అయితే దీన్ని Taumata hill అని పిలుస్తారు.

ఇక్కడ ఉండే కీటకాలు ప్రపంచంలోనే అతి పెద్ద కీటకాలు. పక్షులూ అంతే. మోవా అనే పక్షి 3.6 మీటర్ల ఎత్తు, 260 కేజీల బరువు ఉంటుంది.

న్యూజిలాండ్‌ రోడ్ల మీద తిరుగుతున్నా, సముద్ర తీరాలకు వెళ్తున్నా ఖచ్చితంగా గొర్రెలు కనిపిస్తాయి. ఇక్కడ మనుషుల కంటే గొర్రెలు ఎక్కువ.

ప్రపంచంలోనే పర్యావరణ స్పృహ ఎక్కువగా ఉండే దేశాల్లో మూడో స్థానం న్యూజిలాండ్‌ది. ఈ దేశంలో 30 శాతం కొండలు, పచ్చికబయల్లు కనిపిస్తాయి.

ప్రపంచంలోనే అతి స్వచ్ఛమైన క్లియరెస్ట్‌ వాటర్‌ లేక్‌ ఇక్కడే ఉంది. దీని పేరు నెల్సన్‌ బ్లూ లేక్‌. 80 మీటర్ల లోతులో ఉండే వస్తువు కూడా కనిపిస్తుంది.

భూమ్మీద మొదట సూర్యోదయం జరిగేది న్యూజిలాండ్‌లోని నార్త్‌ ఐలండ్‌లో ఉండే గిబ్సన్‌ నగరంలో!