ప్రపంచంలో 33 రకాల సీల్స్‌ ఉన్నాయి. 25 మిలియన్ల కితం యాభై రకాల సీల్స్‌ ఉండేవని అవశేషాలను బట్టి పరిశోధకులు చెబుతున్నారు.

కాస్పియన్‌ సీల్‌ ప్రపంచంలోనే అతి చిన్నది. దీని బరువు 49 కేజీలు. ఎలిఫెంట్‌ సీల్‌ ప్రపంచంలోనే అతి పెద్దది. దీని బరువు 4000 కేజీలు.

ఇవి చేపలు, పక్షులను తిని బతుకుతాయి. ఈతకొట్టడంలో వీటికెవరూ లేరు సాటి. సముద్రం లోపల రెండు గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించగలవు. అయినా ఆక్సిజన్‌ను తీసుకోగలవు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఇవి నీటిలోనే నిద్రపోతాయి.

ఎలుగుబంటి లాంటి నడక ఉండే వీటిని సీల్‌ లైన్స్‌ అంటారు. వీటికి శిక్షణ ఇచ్చి నీటి కొలనుల్లో, స్విమ్మింగ్‌ పూల్స్‌లో ఆడిస్తారు. వీటిని చూడటానికి విదేశాల్లో పిల్లలు, పెద్దలు అమితాసక్తి చూపుతారు.

ప్రతి ఏడాది ఆహారం కోసం కొన్ని వేల కిలోమీటర్లు సముద్రంలో వెళ్తూనే ఉంటాయి.

గడ్డకట్టే నీటిలో కూడా ఇవి జీవించగలవు. వీటిరక్తం అంత వేడిగా ఉంటుంది.

చాలా వరకు సీల్స్‌ అన్ని సముద్రాల్లోనే జీవిస్తాయి.

ఒక జాతి మాత్రం రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని మంచి నీటి సరస్సులో జీవిస్తాయి.

వీటి జీవనకాలం 30 ఏళ్లు. అది కూడా మగవాటి కంటే ఆడసీల్స్‌ ఎక్కువకాలం జీవిస్తాయి. బాధాకరమైన విషయమేంటంటే వేటగాళ్ల వలలు, కెమికల్స్‌, పర్యావరణ కాలుష్యం బారినపడి చనిపోతుంటాయివి. ముఖ్యంగా వీటిని వందల ఏళ్ల నుంచి మాంసం కోసం వేటాడే జనాలున్నారు.