నిద్రలోనే నడిచే అలవాటును వైద్య పరిబాషలో స్లీప్ వాకింగ్, సోమ్నాంబులిజం అంటారు.

సాధారణంగా చిన్నపిల్లల్లో స్లీప్ వాకింగ్ ఎక్కువగా కనిపిస్తుంది.

నిద్రలోకి జారుకున్న తరువాత రెండు గంటలలోపు జరుగుతుంది.

పెద్దలలో ఎక్కువ సేపు మేల్కోవటం, మానసిక ఒత్తిడి, జ్వరం, చలి, ప్రయాణం, నాడీ వ్యవస్ధకు ఇబ్బంది తెచ్చే మందుల ప్రభావం వల్ల కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి.

నిద్రలో నడిచాననే మెలకువ వచ్చాక ఏమాత్రం గుర్తుండదు.

వంశపారంపర్య కారకాలు, అధిక అలసట, శరీర బలహీనత, నిరంతర తలనొప్పితో మైగ్రేన్, తలకు బలమైన గాయం వంటి సందర్భాల్లో స్లీప్ వాకింగ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిద్రలోనే నడిచే అలవాటును వైద్య పరిబాషలో స్లీప్ వాకింగ్, సోమ్నాంబులిజం అంటారు.

అలవాటు మాన్పించాలని చేతులను, కాళ్లను మంచానికి కట్టేసి కంట్రోల్ చేయాలనుకోవడం పొరబాటు.

వైద్యులు దీనిని మానసిక సమస్యగా పరిగణించి ట్రీట్మెంట్ అందిస్తారు.

వైద్యపరంగా నిర్దిష్టమైన చికిత్స లేకపోయినా హిప్నాసిస్ వంటి ప్రక్రియలతో ట్రీట్ చేయొచ్చు.

కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ సమస్య క్రమంగా అదే తగ్గిపోతుంది.