సీతా ఫలం..రామా ఫలం..లక్ష్మణ ఫలం ఈ మూడు ఫలాలు ప్రకృతి మనిషికి ప్రసాదించిన ఔషధాల గనులు..

పైకి చూడడానికి కొంచెం పనస పండులా, లోపల సీతాఫలంలా కనిపించే లక్ష్మణ ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పలు పరిశోధనల ద్వారా తెలిసింది..

పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ కు ఈ లక్షణ ఫలం చెట్లు మంచి ఔషధమని చెబుతున్నారు నిపుణులు.

పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా లక్ష్మణ పండు తినడం.. వలన మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఈ పండును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు.

లక్ష్మణ ఫలం చెట్టు బెరడు, పువ్వులు, మొగ్గలు, ఆకులు, పండ్లు ఇలా అన్నిటిలోనూ ఉండే ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిపారు.

ఈ పండులో ఉండే ఫైబర్‌  గుణం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

లక్ష్మణఫలం పువ్వులు,  మొగ్గలు ఆస్తమా, పిల్లికూతలు, దగ్గును నివారిస్తాయి.ఆకులు,గింజలు, బెరడు కూడా అనేక వ్యాధులను నివారించడానికి వినియోగిస్తారు.