ఇటీవలి కాలంలో మన సౌత్ సినిమాలు బాలీవుడ్‌ని బాగా డామినేట్ చేస్తున్నాయి. బాలీవుడ్లో కూడా అత్యధిక కలెక్షన్లు రాబడుతున్నాయి. హిందీలో ఫస్డ్ వీక్ హైయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సౌత్ సినిమాలు ఇవే..
ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా బాలీవుడ్లో మొదటి వారంలోనే 247 కోట్లు వసూలు చేసి ఇప్పటివరకు కూడా హైయెస్ట్ రికార్డుగా నిలిచింది.
రజినీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి చేసిన 'రోబో 2.0' సినిమా బాలీవుడ్లో మొదటి వారం 133 కోట్లు కలెక్ట్ చేసింది.
ప్రభాస్ 'సాహో' సినిమా ఇక్కడ అంతగా ఆడకపోయినా బాలీవుడ్లో భారీ విజయం సాధించి మొదటి వారం 116 కోట్లు వసూలు చేసింది.
ప్రభాస్ 'బాహుబలి' సినిమాకు బాలీవుడ్లో మొదటి వారం 46 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప' బాలీవుడ్లో మొదటి వారం 27 కోట్లు రాబట్టింది.
యశ్ హీరోగా వచ్చిన 'కెజియఫ్ ఛాప్టర్ 1' సినిమా బాలీవుడ్లో ఫస్ట్ వీక్ 22 కోట్లు వసూలు చేసింది.
రజినీకాంత్ 'కబాలి' సినిమా మొదటి వారం బాలీవుడ్లో 20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.