పొడవుగా ఉన్నా.. లావుగా ఉన్నా  చెట్టు ఉన్నచోటి నుంచి కదలదు..

కానీ నడిచే చెట్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా?!

ఆ నడిచే చెట్టు పేరు ‘Socratea exorrhiza’.నడుస్తుంది కాబట్టి దీన్ని వాకింగ్ పామ్ అంటారు..

ఈ చెట్టు ప్రపంచంలో అన్ని చోట్లా కనిపించే చెట్టు కాదు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్టులో సొక్రాటీ ఎగ్జోరిజా చెట్లు కనిపిస్తాయి.

ఈ చెట్టు వేర్లు భూమిలో కాకుండా... చెట్టు మొదట్లో  చాలా వరకూ పైకే ఉంటాయి.

అవి వెలుతురు వున్న వైపు పెరుగుతూ..భూమిలోకి చొచ్చుకెళ్తాయి. తిరిగి కొత్త వేర్లు పుట్టగానే... పాత వేర్లు చనిపోతాయి. అలా ఈ చెట్టు నీడలోంచీ ఎండలోకి నడుస్తుంది. అలారోజుకి 2,3 సెం.మీటర్లు కదులుతుంది.

అమెజాన్ అడవుల్లో... వెలుతురు చాలా తక్కువగా పడుతుంది. పెద్ద పెద్ద దట్టమైన చెట్ల వల్ల అక్కడి భూమిపై ఎండ పెద్దగా పడదు.

ఈ చెట్టు ఆ నీడ ప్రదేశంలో ఉంటే... ఎలాగైనా ఎండ కోసం వెలుతురు ఉన్నవైపు ప్రయాణిస్తుంది. ఎండ తనపై పడేవరకూ అలా వెళ్లుతునే ఉంటుంది.

ఎండ బాగా పడితే...ఇక అక్కడ నడక ఆపుతుంది.  ఈ చెట్లు 25 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి.

1961లో ఈజేహెచ్ కార్నర్ అనే పెద్దాయన... అమెజాన్ అడవుల్లో తిరుగుతూ...వేర్లు భూమిపైన ఉన్న ఈ చెట్టును చూసి ఆశ్చర్యపోయారు.వరదల్ని తట్టుకోవడానికి ఇలా ఉన్నాయేమో అనుకున్నారు...

ఆ తర్వాత 1980లో జాన్ బోడ్లీ అసలు విషయాన్ని చెప్పారు. ఈ చెట్టు నడుస్తోందని చెబితే... ఎవరూ నమ్మలేదు. దాంతో పరిశోధనలు జరిగాయి.

1983లో ఇది నడుస్తోందనే విషయాన్ని నిర్ధారించారు. దాంతో ఈ చెట్టుకి వాకింగ్ పామ్ అనే పేరు వచ్చింది.