శ్రీలంక లోని జాఫ్నాలో ఇటీవల అనూహ్య సంఘటన జరిగింది

కొంత మంది యువకులు పెద్దసైజు  గాలిపటం తయారు చేసి దానికి బలమైన తాడు కట్టారు

గాలిపటాన్ని ఎగరేసే క్రమంలో దాని వేగాన్ని నియంత్రించాలని చూసినా యువకుల వల్ల కాలేదు

ఒక యువకుడు గాలిపటం తాడు పట్టుకుని గాల్లోకి ఎగిరాడు

గాలి వేగం పెరగటంతో దాదాపు 70 అడుగుల ఎత్తుకు ఎగిరాడు

కొద్ది సేపట్లో గాలి తగ్గటంతో 30 అడుగుల ఎత్తునుంచి కిందకు దూకాడు

యువకుడికి స్వల్పగాయాలు అవటంతో ప్రాణాపాయం తప్పింది