సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ వివాహం చేసుకుని, కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయినవారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో విడిపోయాక కూడా ఇంకా సింగిల్‌గానే ఉన్న కొందరు స్టార్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నోయల్ సీన్ నటి ఈస్టర్ నోరోన్హాను 2019లో వివాహమాడగా, ఆరు నెలలకే వీరిద్దరు విడిపోయారు.

సుమంత్ నటి కీర్తి రెడ్డిని 2004లో పెళ్లి చేసుకుని, ఏడాది తరువాత విడాకులు తీసుకున్నారు.

అదితి రావు హైదరి 21 ఏళ్లకే నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహమాడి, 2013లో తామిద్దరం విడిపోయినట్లుగా వెల్లడించింది.

మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డి నుండి విడాకులు తీసుకున్నట్లుగా 2019లో ప్రకటించాడు.

సోనియా అగర్వాల్ దర్శకుడు సెల్వ రాఘవను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, 2010లో విడాకులు తీసుకుంది.

అమలా పాల్ దర్శకుడు ఏఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, 2016లో విడాకులు తీసుకుంది.

సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ స్టార్ బ్యూటీ, గతేడాది అక్టోబర్‌లో విడిపోతున్నట్లుగా ప్రకటించింది.