పీచెస్, చెర్రీస్, ఆప్రికాట్స్, ప్లమ్స్,మామిడి,రేగు పండ్లు వంటివాటిని స్టోన్ ఫ్రూట్స్ అంటారు.
సీజనల్ వ్యాధులను ఎదుర్కోవటానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే స్టోన్ ఫ్రూట్స్ చక్కటి మార్గాలంటున్నారు పోషకాహార నిపుణులు..
ఈ పండ్లు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి..
పీచ్, ప్లమ్ వంటి పండ్లలో పొటాషియం స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి బీపీని అదుపు చేస్తాయి.
అలసట, నీరసం.. వంటివి దూరంచేస్తాయి..హైబీపీ ఉన్నవారు ఈ పండ్లు తీసుకుంటే అలసట, నీరసం నుంచి ఉపశమనం కలుగుతుంది..
స్టోన్ ఫ్రూట్స్ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ వంటివి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే స్టోన్ ప్రూట్స్ ని ఆహారంలో చేర్చుకోవటం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.
స్టోన్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని సహజంగా పెంచి చర్మం,జుట్టును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.