ఈ ప్రపంచంలో.. ఎన్ని వింతలో ఎన్నెన్ని విడ్డూరాలో..

సైగా జింక:  వింత ముక్కుతో విచిత్రంగా ఉంటుంది. రష్యా, కజకిస్తాన్ వంటి దేశాలలో కనిపిస్తాయి.

స్పూన్‌బిల్  పక్షి : దీని ముక్కు ఒక స్పూన్ లాగా ఉంటుంది. అందుకే ఆ పేరు

లాంప్రే : ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపించే చేప లాంటి జీవి. ఇది ఆహారాన్ని పట్టి దంతాలతో పట్టి ఉంచి రక్తం తాగుతుంది.

పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో:  ఎలుకలా కనిపిస్తుంది.  గుంతలు తవ్వడంలో ఎక్స్ పర్ట్..నీటిలో కూడా ఈదగలదు..

స్టార్ ముక్కు : దీని ముక్కు నక్షత్రంలా కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు. ఇది సెకనుకు 13 జీవులను వేటాడుతుంది.

ఆక్టోపస్ డంబో గా పిలువబడే పెలాజిక్ గొడుగు ఆక్టోపస్‌ల జాతికి చెందినది

అంగోరా కుందేలు : శరీరం నిండా బొచ్చు ఉంటుంది. బంతిలా గుండ్రంగా ఉండే ఈ కుందేలు పురాతన జాతి అంటారు

చేతులతో నడిచే గులాబీరంగు అరుదైన చేప..ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో.. 22 ఏళ్ల తరువాత సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ ఈ నడిచే చేపను గుర్తించారు పరిశోధకులు

గ్లాకస్ అట్లాంటికస్ : "బ్లూ డ్రాగన్"అనే సముద్రపు జీవి. తలక్రిందులుగా తేలుతూ ఉంటాయి