భారత్ దేశంలో ఎన్నో దేవాలయాలు..వాటిలో ఎన్నెన్నో విచిత్ర సంప్రదాయాలున్నాయి..కొన్ని దేవాలయాల్లో దేవుడికి పెట్టే నైవేద్యాలు వింతగా ఉంటాయి. మరి ఆదేవాలయాలు ఏమిటో ఎటువంటి ప్రసాదాలు పెడతారో చూసేద్దాం..

గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి, గారెలు భక్తులకు ప్రసాదంగా పెడతారు.

కానీ మనం ఇప్పుడు చెప్పుకునే దేవాలయాల్లో మద్యం, మాంసం, నూడుల్స్, చాక్లెట్స్ నైవేద్యంగా పెడతారు..

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయని లోని కాలభైరవ్ నాథ్ దేవాలయంలో దేవుడికి మద్యం నైవేద్యంగా పెడతారు. ఆ మద్యాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు..

కొలకత్తాలోని కాళిమాత దేవాలయంలో నూడుల్స్ అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఆ నూడుల్సే  ప్రసాదంగా ఇస్తారు.

కొలకత్తా లోని తాన్గ్రా ప్రాంతంలో కల చైనా ప్రజలు నివసిస్తుంటారు. ప్రజలు కాళీమాతను కొలుస్తారు. ఈ చైనీయులు, అంతా చాలావరకూ బౌద్ధులు,క్రిస్తియన్లుగా వుండటం మరో విశేషం..

తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో మునియండి అనే దేవాలయంలో మునియండి స్వామికి ‘బిర్యానీ’ నైవేద్యంగా పెడతారు. బిర్యానీనే భక్తులకు ప్రసాదంగా పెడతారు.

కేరళలోని అలప్పుజాలోని కెమ్మోత్ శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో దేవతకి చాక్లెట్ నైవేద్యంగా పెడతారు. చాక్లెట్సే ప్రసాదంగా పెడతారు..

గుజరాత్‌ సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో శివుడికి బతికున్న ‘పీతలు’తో అభిషేకం చేస్తారు. ఆ పీతలనే స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఆ పీతలనే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.