హ్యాండ్ బ్యాగులు చిన్నవిగా కాకుండా కాస్త పెద్దవి వాడటం మంచిది. గొడుగు, రెయిన్ కోటు పట్టే అంతసేజు బ్యాగు అయితే బాగుంటుంది.

వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది.

యువతులు కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడడం మంచిది. 

సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. స్కిన్ టైట్ లెగ్గిన్స్ కూడా బాగుంటాయి. 

చీరలు, చుడీదార్లు వేసుకునే వారు శాండిల్స్, షూస్ వంటివి వేసుకుంటే మంచిది.

వర్షాకాలంలో ట్రాన్స్ప‌రెంట్ దుస్తులకు దూరంగా ఉండండి. జీన్స్ లాంటివి టైట్ డ్రెస్సులు వాడవద్దు. 

ఈ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో తడి బట్టల్ని ధరించకండి. అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

స్లిప్పర్స్ వాడితే బట్టలపై బురద చిమ్ముతుంది. బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశాలు ఉంటాయి. 

దుస్తులతో పాటు వాతావరణాన్ని బట్టి గొడుగు, రైన్ సూట్ లాంటివి తీసుకెళ్లడం మర్చిపోకండి.