ఈ ఏడాది ఎండలు బాగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్ధాయిలో నమోదవుతున్నాయి. 

వేసవి కాలంలో పిల్లలు, పెద్దలు కాటన్‌, లైట్‌ వెయిట్‌ ఉన్న దుస్తులు ధరించడం మరీ మంచిది

పిల్లలు,పెద్దలు దాహం వేసినా, వేయక పోయినా తరచుగా నీటిని తాగుతూ ఉండాలి

పిల్లలు ఎండలో ఆడకుండా చూడాలి

ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా గొడుగు  తీసుకు  వెళ్లండి

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పిల్లలు బయటకు రాకుండా చూడడం మంచిది

బయటకు వెళ్లే ముందు రెండు నుంచి నాలుగు గ్లాసుల నీటిని తాగాలి..ఎండలో నుంచి ఒక్కసారిగా ఏసీ  లోకి రాకూడదు

ఎవరికైనా వడదెబ్బ తగిలితే  ఆ వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లాలి.చల్లని నీటిలో తడిపి పిండిన నూలు వస్త్రంతో ఒళ్లంతా తుడుస్తూ శరీరాన్ని చల్లబడేలా చేయాలి

కొంతమందికి వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఐవీ ద్వారా ప్లూయిడ్స్‌ను అందించాల్సి ఉంటుంది

వడదెబ్బకు గురైన వారికి మజ్జిగ, గ్లూకోజ్‌ నీరు, చల్లని మంచినీరు, కొబ్బరి బొండాలు తాగించడం మంచిది