ఈ పక్షి పేరు సమ్మర్‌ టానేజర్‌

మగ పక్షి ఎరుపు రంగులో ఉంటుంది. ఆడపక్షి మాత్రం పసుపు రంగులో ఉంటుంది

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మెక్సికోల్లో వీటి జాతి ఉంటుంది

బరువు 29 గ్రాములు ఉంటుంది. పొడవు 17 సెం.మీ ఉంటుంది, రెక్కల పొడవు -30 సెం.మీ.

ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. గుంపుగా పురుగుల వేటకు వెళ్తాయి

గాల్లో తిరిగే పురుగుల్ని గాల్లో పట్టుకుని తినటానికి ఇష్టపడతాయి. బెర్రీలు, పండ్లు తింటాయి

ఆడపక్షులు గడ్డి, ఆకులను ఉపయోగించి కప్‌ మాదిరిగా గూళ్లు కడతాయి

పొదిగేకాలం 13 రోజులు. పుట్టిన పిల్లను మూడున్నర వారాలు బాగా చూసుకుంటాయి

రుతువుల్ని బట్టి ఒక ప్రాంతంనుంచి మరొక ప్రాంతానికి వలస పోతాయి, మనుషుల దగ్గరకు రావటానికి ఇష్టపడవు

పిక్‌-టుక్‌ అనే సౌండ్‌తో అరుస్తాయి

4 సంవత్సరాల నుంచి ఆరేళ్ల వరకూ జీవిస్తాయి