ఉక్రెయిన్ సంక్షోభం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

అదే.. మన భారతీయుల వంటిల్లుకు కూడా పెనుభారంగా మారనుంది

వంట నూనె దిగుమతికి ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలతో కొరత ఏర్పడనుంది.

భారత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

భారతీయల్లో ఎక్కువగా వాడే వంటనూనెల్లో సన్ ఫ్లవర్ ఆయిల్ వినియోగం 10శాతంగా ఉంది

భారత్‌లో పామ్ ఆయిల్ నెంబర్ స్థానంలో ఉండగా.. రెండో అతిపెద్ద వంటనూనెగా సన్ ఫ్లవర్ వినియోగంలో ఉంది.

రష్యా, అర్జెంటీనా దేశాలు భారత మార్కెట్లోకి సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేస్తున్నాయి.

74 శాతం సన్ ప్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. 

ఈ ఏడాది జనవరిలో రూ.2.05 లక్షల టన్నుల నుంచి 3.07 లక్షల టన్నులకు చేరుకుంది. 

భారతీయులు వాడే వంటనూనెగా సన్ ఫ్లవర్ ఆయిల్‌కు ఎక్కువగా డిమాండ్ పెరిగింది.