బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవటానికి..

నిమ్మ, దాల్చిన చెక్కతో తయారు చేసే డ్రింక్ బాగా ఉపకరిస్తుంది.

ఈ డ్రింక్‌ను చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 

పొయ్యిపై గిన్నెలో నీరు పోసి బాగా మరిగిస్తుండాలి. 

ఆ నీటిలో టేబుల్ స్పూన్ అల్లం తరుగు,

టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, నాలుగైదు నిమ్మపండు ముక్కలు,

కాస్త దాల్చిన చెక్క వేసుకుని 15నిమిషాలు మరిగించాలి. 

ఇలా మరిగించిన వాటిని కాస్త చల్లారక బ్లెండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 

ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకుని రుచికోసం తేనెను కలుపుకుని తాగాలి.

ఉదయం ఈ డ్రింక్‌ను తీసుకుంటే..

రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క్రమంగా కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.