ఆన్లైన్లో ఎన్ని వెరైటీలు ఉన్నప్పటికీ ఫుడ్ లవర్స్ హాట్ ఫేవరేట్ బిర్యానీయే అని స్విగ్గీ తేల్చి చెప్పింది. తాజాగా విడుదల చేసిన 7 వార్షిక నివేదికలో ఆన్లైన్ ఆర్డర్ల గురించి కొన్ని వివరాలను వెల్లడించింది.
స్విగ్గీ రిపోర్టు ప్రకారం.. దేశంలో ప్రతి సెకనుకు 2 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయట
ప్రతి నిమిషానికి 137 బిర్యానీలను ఇండియన్లు లాగించేస్తున్నారు.
గత ఏడేళ్లుగా ఈ లిస్టులో బిర్యానీయే మొదటి స్థానంలో ఉంది.
బిర్యానీలో చికెన్ బిర్యానీ ఆర్డర్స్ చాలా ఎక్కువున్నాయట. ఆన్లైన్ జోరు మొత్తం చికెన్ బిర్యానీదే.
బిర్యానీ తర్వాత మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ ఆహార పదార్థాల్లో పిజ్జా టాప్లో ఉంది.
ఆ తర్వాత సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ రామెన్, ఇటాలియన్ పాస్తా ఉన్నాయి.
ఈ యేడాది గులాబ్ జామూన్ 27 లక్షల సార్లు ఆర్డర్ చేశారట.