ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పిల్లలు అస్వస్థతకు గుర‌య్యే అవ‌కాశ‌ముంది.

బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడాలి. వర్షంలో పిల్లలను తడవనీయవద్దు.

స్కూల్‌ నుంచి రాగానే దుస్తులు, షూ, సాక్స్‌ తొలగించి స్నానం చేయించాలి.

వాతావరణం చలిగా ఉంటే వేడి నీళ్లలో టవల్‌ ముంచి తుడవాలి. చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.

బయటి ఆహారం కాకుండా ఇంటిలో వండిన వేడి ఆహారం తీసుకోవాలి.

ఇంట్లో కాచి వడ కట్టిన నీళ్లను పిల్లలకు ఇవ్వాలి.

బయటి ఆహారం, నీళ్ల వల్ల వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్‌ ఇబ్బందుల ముప్పు ఉంటుంది.

బయటకు వెళ్లివ‌చ్చిన పిల్లలను ఏడాదిలోపు శిశువుల వద్దకు వెళ్లనీయవద్దు.

అయిదు నెలల లోపు పిల్లలను వెచ్చటి దుస్తులలో పడుకోబెట్టాలి.

నెలల పిల్లలను వ‌ర్షాల స‌మ‌యంలో ఎట్టిప‌రిస్థితుల్లో బయటకు తీసుకురావద్దు.