రాత్రి వేళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
పగలు, రాత్రి సమయాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి.
చలి కాలంలో ఇన్‌ఫ్లూయంజా, ఫ్లూ, రైనో వైరస్ దాడి చేసే ప్రమాదముంది.
అస్తమా, సీఓపీడీ, న్యుమోనియా, స్వైన్‌ఫ్లూ వంటి జబ్బులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
కొందరిలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరం, ఆయాసం తదితర సమస్యలు పెరుగుతాయి.
మహిళలు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి.
దగ్గు, జలుబు, అస్తమా, న్యుమోనియాను నిర్లక్ష్యం చేయొద్దు.
స్వైన్‌ఫ్లూ నియంత్రణకు వ్యాక్సిన్లు వేయించుకోవాలి.
అస్తమా, ఈఎన్‌టీ బాధితులు, గొంతునొప్పితో బాధపడేవారు నీటిని కాచి, చల్లార్చి వడపోసుకుని తాగాలి.
శరీరం పూర్తిగా కప్పి ఉండే విధంగా దుస్తులు ధరించాలి.
చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తీసుకోవద్దు.