చలికాలంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. పట్టించుకోకుండా వదిలేస్తే చర్మం కాంతివిహీనంగా మారుతుంది.
చలికి పెదాలు, అరికాళ్ల పగుళ్లు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
చలికాలంలో కొన్ని చిట్కాలతో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.
చలికాలంలోనూ నీటిని బాగా తాగాలి
ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో చర్మ సంరక్షణ కష్టమైనది.
అలొవెరా జెల్, సబ్బులతో ఫేస్‌వాష్ చేసుకోవాలి.
రాత్రిపూట నిద్రపోయే ముందు అలొవెరా జెల్ క్రీమ్‌ను పట్టించుకుంటే చర్మం హైడ్రేట్ అవుతుంది.
వేడి నీళ్ల స్నానం చేయవద్దు. కేవలం గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి.
అరటి, దానిమ్మ, నారింజ, బొప్పాయి వంటి పండ్లు తింటే చర్మంలో కాంతి వస్తుంది.
బొప్పాయి ఫేస్ మాస్క్, నారింజ ఫేస్ మాస్క్‌లు వేసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం ఉండదు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయం నడక, యోగా చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి చర్మంలో మెరుపు వస్తుంది.
లిప్‌బామ్‌తో పాటు కళ్లకింద మాయిశ్చరైజర్స్‌ను రాసుకోవాలి.
చర్మానికి వెన్న పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.
బయటికి వెళ్లినా, ఇంట్లో ఉన్నా స్వెటర్ ధరించాలి. తలకు క్యాప్, చేతులకు గ్లౌజులు వాడితే మంచిది.
తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.