మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చాలామంది టైప్-2 మధుమేహం బారినపడుతున్నారు.

మధుమేహం వచ్చే ముప్పును తగ్గించుకోవడానికి..

ముందు నుంచే అప్రమత్తంగా ఉంటే దాని బారినపడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.

టీ తాగితే టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుందని గుర్తించారు.

8 దేశాల్లో దాదాపు 10 లక్షల మంది ఆరోగ్యంపై అధ్యయనం.

మోతాదుకు మించకుండా బ్లాక్, గ్రీన్, ఊలాంగ్ టీ తాగేవారికి..

టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు 17 శాతం తగ్గుతుందని తేల్చారు.

రోజుకి నాలుగు కప్పుల టీ తాగే వారిలో ఈ ప్రయోజనాలను గుర్తించినట్లు వివరించారు.

టీ తాగుతూ టైప్-2 మధుమేహ ముప్పు నుంచి దూరంగా ఉండొచ్చని చెప్పారు.

ప్రతిరోజు టీ తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది.