శ్రీ‌లంక‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను భార‌త్ జ‌ట్టు క్లీన్‌స్వీప్ చేసింది. 

317 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. 

వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది. 

ఐర్లాండ్‌పై 290 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ పేరిట రికార్డును భార‌త్ అధిగ‌మించింది. 

2015లో ఆఫ్గానిస్థాన్‌పై 275 ప‌రుగుల‌తో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. 

2010లో జింబాబ్వేపై 272 ప‌రుగుల తేడాతో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. 

2012లో శ్రీ‌లంక జ‌ట్టుపై 258 ప‌రుగుల తేడాతో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. 

2007లో బెర్ముడా జ‌ట్టుపై 257 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. 

2015లో వెస్టిండీస్ జ‌ట్టుపై సౌతాఫ్రికా 257 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 

2003లో న‌మీబియా జ‌ట్టుపై ఆస్ట్రేలియాలో 256 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 

2008లో హాంకాంగ్ జ‌ట్టుపై భార‌త్ 256 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 

2016లో ఐర్లాండ్ జ‌ట్టుపై పాకిస్థాన్ జ‌ట్టు 255 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధిచింది.