నోటి సంరక్షణ విషయంలో జాగ్రతలు పాటించటం తప్పనిసరి. దానికోసం వాడాల్సిన పదార్ధాలేవో తెలుసుకుందాం.
వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తాయి.
కొన్ని చుక్కల వేపరసాన్ని పళ్లు, చిగుళ్లపై రాయాలి. కాసేపటి తరువాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి.
లవంగం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి.
పావు చెంచా నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె కలిపి, అందులో దూదిని ముంచి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచాలి.
దంత క్షయానికి, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే ఆమ్లాలను వంటసోడాలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నియంత్రిస్తాయి.
అదే పనిగా వాడితే దంతాలపై ఎనామిల్ కు హాని కలుగుతుంది.
ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి గుళ్లను కాపాడతాయి.
ఉసిరి సహజ క్లెన్సర్ లా పనిచేసి నోటి దుర్వాసన పోగొడుతుంది.
రోజుకొక ఉసిరి కాయను తిన్నా లేదంటే పావు స్పూను ఉసిరి పొడిని అరకప్పు నీటిలో కలిపి తాగినా ఫలితం ఉంటుంది.