ప్రస్తుతం థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' నడుస్తుండగా ఈ వారం ఓటిటిలోకి కూడా పెద్ద సినిమాలే రానున్నాయి. ఈ వారం ఓటిటిలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు ఇవే..

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ లో  స్ట్రీమింగ్‌ కానుంది.

భారత క్రికెటర్‌ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ప్రవీన్‌ తాంబే ఎవరు?’ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మలయాళం సినిమా ‘జూన్‌’ తెలుగు డబ్బింగ్ చేసుకొని ‘హలో జూన్‌’ పేరుతో తెలుగు ఓటీటీ ‘ఆహా’లో  ఏప్రిల్‌ 1 నుంచి  స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

శర్వానంద్‌, రష్మిక జంటగా వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సోనీలివ్‌ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది.