100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు

ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి అత్యధికంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

ప్రభాస్ 'సాహో' సినిమా అన్ని భాషల్లో కలిపి 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ప్రభాస్ నుంచి తాజాగా వచ్చిన 'రాధేశ్యామ్' సినిమా 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' 187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మహేష్ బాబు నటించిన 'స్పైడర్' సినిమా 124.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీ 124.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ప్రభాస్ నటించిన 'బాహుబలి 1' సినిమా 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి తెలుగులో తొలిసారి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇటీవల పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ 106.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.