జూన్ నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు..

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా అడవి శేష్ హీరోగా తెరకెక్కిన 'మేజర్' సినిమా జూన్ 3న రిలీజ్ అవ్వనుంది.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో, సూర్య గెస్ట్ గా నటించిన భారీ మల్టీస్టారర్ 'విక్రమ్' సినిమా జూన్ 3న రిలీజ్ కాబోతోంది.

నాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన 'అంటే సుందరానికి' సినిమా జూన్ 10న ధియేటర్లో రిలీజ్ కాబోతుంది.

సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమా జూన్ 17న రిలీజ్ కాబోతుంది.

రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం జూన్ 17న రానుంది.

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి నటిస్తున్న 'సమ్మతమే' సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.