మన దేశంలో ఉన్న కొన్ని దేవాలయాల్లోకి మహిళలకు ప్రవేశానికి అనుమతి లేదు. కానీ కొన్ని దేవాలయాల్లోకి మగవారికి ‘నో’ ఎంట్రీ అని  తెలుసా? అటువంటి దేవాలయాలు ఏమిటో చూద్దాం..

కుమారీ అమ్మన్‌ గుడి : కన్యాకుమారిలో ఉన్న ఈ దేవాలయంలోకి పెళ్లైన మగవారికి ప్రవేశం లేదు.

మాతా టెంపుల్‌ : బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఉందీ ఆలయం. మహిళలు నెలసరి సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకుంటారు.

ఆ సమయంలో పూజారులు సైతం అక్కడికి రావడం నిషేధం..

అట్టుకల్‌ భగవతీ ఆలయం : కేరళలో ఉన్న దేవాలయం ‘మహిళల శబరిమల’గా పేరు.

ఈ ఆలయంలో ఏటా జరిగే ‘పొంగల్‌’ పండగలో లక్షల మంది మహిళలు పాల్గొంటారు.  దీంతో ఆలయం గిన్నిస్‌ బుక్‌లో నమోదు అయ్యింది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఉత్సవంలో అట్టుకల్‌ భగవతీ అమ్మవారికి మహిళలు గాజులను కానుకగా సమర్పిస్తారు.

బ్రహ్మదేవుడి గుడి : రాజస్థాన్‌లోని పుష్కర్ లోని బ్రహ్మ గుడిలోకి వివాహం అయిన పురుషులకు ప్రవేశం లేదు.

ఈ పుష్కర్ తీరాన బ్రహ్మ, సరస్వతి యజ్ఞం చేయాలని సంకల్పించారట.. కానీ సర్వస్వతీదేవి యజ్ఞానికి ఆలస్యంగా రావడంతో బ్రహ్మదేవుడు గాయత్రీ దేవిని వివాహం చేసుకుని యజ్ఞం ముగిస్తాడు.

దీంతో కోపం వచ్చిన సరస్వతిదేవి ‘గుడిలోకి ప్రవేశించిన వివాహం అయిన మగవారికి వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి’ అని శాపమిచ్చిందట.