కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బుధవారం సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. కాగా, ఈ బడ్జెట్‭లో ప్రభుత్వం ఏడు లక్ష్యాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడు లక్ష్యాలను ఆమె ‘సప్తర్షి’గా పేర్కొన్నారు.

కలుపుగోలు అభివృద్ధి

చివరి మైలును అందుకోవడం

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు

సంభావ్యతను వదులుకోవడం

పచ్చదనం పెరుగుదల

యువశక్తికి ప్రాధాన్యం

ఆర్థిక రంగం వృద్ధి