బెల్లం నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.లివర్ లో ఉండే వ్యర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

ద‌గ్గు, జ‌లుబు ఉన్న‌వారు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిన్న బెల్లం ముక్క వేసి బాగా క‌లిపి ఆ నీటిని తాగితే.. వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

బెల్లాన్ని రోజు తింటే ర‌క్తం శుద్ధి అవుతుంది.

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు జింక్‌, సెలీనియం వంటి పోష‌కాలు ఉంటాయి. రోజు తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

బెల్లం రోజు తీసుకుంటే శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశ‌యం, ఆహార నాళం శుభ్ర‌మ‌వుతాయి.

బెల్లంలో ఉండే పోష‌కాలు మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. రుతు స‌మ‌యంలో స్త్రీలు బెల్లంను రోజూ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.

బెల్లంలో ఐర‌న్‌, ఫోలేట్‌లు స‌మృద్దిగా ఉంటాయి.రోజు  తింటే ఎర్ర ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం బెల్లం తింటే మంచిది.

10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీగ్రాముల మెగ్నిష‌యం ఉంటుంది. ఇది పేగుల‌కు బ‌లం చేకూరుస్తుంది. దీంతో పేగులను సుర‌క్షితంగా ఉంచుతుంది.

బెల్లం వేసి త‌యారు చేసిన పాన‌కం వంటివి వేస‌విలో తాగితే చల్లదనం కలుగుతుంది. ఎండ వేడి నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం ద్వారా ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం త‌రువాత చిన్నబెల్లం ముక్క‌ను చ‌ప్ప‌రించి తింటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు.

ఆర్థ‌రైటిస్‌, కీళ్ల స‌మ‌స్య‌లు, నొప్పులు, వాపులు ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది..

బెల్లం అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు స‌హాయ ప‌డుతుంది. నిత్యం భోజ‌నం చేశాక దీన్ని మ‌ధ్యాహ్నం, రాత్రి తింటే మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చు అయి అధిక బ‌రువు త‌గ్గుతారు.

శ‌రీరానికి త‌క్ష‌ణ‌మే శ‌క్తి కావాల‌ని అనుకునేవారు, బాగా అల‌స‌టగా ఉన్నప్పుడు బెల్లం తిని ఒక గ్లాస్ నీటిని తాగితే వెంట‌నే శ‌క్తి ల‌భిస్తుంది.

మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను  చ‌ప్ప‌రించి తింటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు.