గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా? అయితే.. ఇది మీ కోసమే
ఈ రోజుల్లో చాలా మంది రోజులో
8-10 గంటలు కూర్చునే పని చేస్తున్నారు
ఇలాంటి వాళ్లకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గితే అనారోగ్య సమస్యలు రావొచ్చు
ఈ అంశంపై బ్రిటీష్ పరిశోధకులు అధ్యయనం చేశారు
కూర్చుని పని చేసే వాళ్లు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలో తేల్చారు
రోజూ కనీసం 30-40 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి
తేలికైన పని కాకుండా.. శ్రమ ఉండే ఏ పని అయినా సరే మంచిది
అయితే, ప్రతి రోజూ క్రమం తప్పుకుండా చేస్తేనే హెల్దీగా ఉంటారు
సైక్లింగ్, స్విమ్మింగ్, గార్డెనింగ్, డ్యాన్సింగ్ వంటివి చాలా మంచివి
వ్యాయామం చేస్తే మరీ మంచిది. అలాగని, అతిగా వ్యాయామం చేయకూడదు