ఓ వ్యోమగామి.. ఎవరితోనూ సంబంధం లేకుండా చీకట్లో ఒంటరిగా, ఎటువంటి సాయం లేకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు.
సుమారు 40 ఏళ్ల క్రితం బ్రూస్ మెక్‌కాండెల్స్ II అనే వ్యోమగామి.. శాటిలైట్ రిపేర్ మిషన్ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు.
దాని కోసం శాటిలైట్ వదిలేసి కనీసం స్పేష్ షిప్‌తో తాడు సహాయం కూడా లేకుండా అలా అంతరిక్షంలోకి వచ్చేశాడు.
కనీసం స్పేస్ క్రాఫ్ట్తో చిన్న కనెక్షన్ కూడా లేకుండా ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేయడం ఇదే మొట్టమొదటి సారి.
ఈ అరుదైన సంఘటన 1984 ఫిబ్రవరిలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
భూమి ఉపరితలానికి 170 మైళ్ల దూరంలో గంటకు 17,500 మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరిగారట.
అలా ఎట్టకేలకు తనతో పాటు వచ్చిన వారితో కమ్యూనికేట్ అవుతూ 12గంటలకు పైగా స్పేస్ వాక్ చేశారు.
రెండు సార్లు స్పేస్ లోకి వెళ్లిన బ్రూస్ 1990 ఆగష్టు 31న రిటైర్మెంట్ ప్రకటించారు.
తన 80ఏళ్ల వయస్సులో 2017 డిసెంబర్ 21న మరణించారు.