మానవీయతకు నిలువెత్తు రూపంగా నిలిచి జీవన పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి స్టీఫెన్ హాకింగ్

శరీరం మొత్తం చచ్చుబడిపోయి.. చక్రాల కుర్చీకే పరిమితమైనా శాస్త్రపరిశోధనలో ఏదో సాధించాలని అహర్నిశలు తపిస్తూ.. మేధోమదనం చేసిన చైతన్యధీరుడు..

1942 జనవరి 8 తేదిన ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన స్టీఫెన్ హాకింగ్

భౌతిక శాస్త్రంలో డిగ్రీ అందుకున్న హాకింగ్ 1962లో కాస్మాలజి, జనరల్ రిలేటివిటీ అనే అంశాలపై పరిశోధనలు చేయడానికి ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళారు.

అప్పుడే మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. నాడీ మండలంతో పాటు వెన్నుపూసను ప్రభావితం చేసే న్యూరాన్ వలనే ఆ శరీరం పూర్తిగా నిస్తేజమైంది.

హాకింగ్ ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.  శరీరం సహకరించకపోయినా.. చక్రాల కుర్చీలకే పరిమితమైనా హాకింగ్ తన పరిశోధనలు ఆపలేదు.

'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనే గొప్ప రచనకు శ్రీకారం చుట్టారు.

డిజిటల్ పరికరాల  సహాయంతో మాట్లాడే యంత్రాన్ని కూడా ఆయన కనుగొన్నారు. అదే స్పీచ్ జెనరేటింగ్ పరికరం ద్వారా తన భావాలను ఎదుటివారితో పంచుకునేవారు..

న్యూక్లియర్ ఆయుధాల వల్ల ఈ భూమండలానికి కలిగే నష్టం అంతా ఇంతా కాదని   చెబుతూ.. దాని చెడు ప్రభావం మానవాళికి ఎలాంటి ప్రమాదాలు తీసుకొస్తుందో   తెలిపిన గొప్ప మానవతావాది హాకింగ్.

హాకింగ్ న్యూరాన్ వ్యాధి బారిన పడకముందే పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు.

ఆ వ్యాధికి మందులేదని.. హాకింగ్ బ్రతికి ఉపయోగం లేదని డాక్టర్లు చెప్పినప్పుడు ,   హాకింగ్ భార్య జేన్ భర్తవైపే నిలిచారు. కంటిపాపలా కాపాడుకున్నారు. పరిశోధనల్లో   ఆమె సహకారాన్ని అందించారు. కొన్నాళ్ల తర్వాత ఆమె హాకింగ్‌కి విడాకులు   ఇచ్చారు..

హాకింగ్ ప్రపంచంలోని దాదాపు శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన దాదాపు అన్ని   పురస్కారాలనూ పొందారు.

1971 సంవత్సరం నుండీ బిగ్‌బ్యాంగ్ థియరీపై పరిశోధనలు మొదలు పెట్టిన హాకింగ్,   కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో తెలియని విషయాలను ఆవిష్కరించారు.

వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదని తేల్చి చెప్పిన శాస్త్రవేత్త హాకింగ్.   అయినా నాస్తికత్వంపై పలు విమర్శలు ఉన్నా.. తన సిద్ధాంతాలతో వాటిని   పటాపంచలు చేసిన మేధావి హాకింగ్..

బ్రూస్ అలెన్, బెర్నార్డ్ కెర్, గ్యారీ గిబ్బన్స్, థామస్ హెర్టాగ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ   శాస్త్రవేత్తలందరూ హాకింగ్ రచనలపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు పొందినవారే.

హాకింగ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తూ 2014లో "థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్" అనే   సినిమా విడుదలైంది. అందులో హాకింగ్ పాత్రను హాలీవుడ్ నటుడు ఎడ్డీ రెడ్మేన్   పోషించారు.

మరణం తనకు చాలా సమీపంలో ఉన్నప్పటికీ... ఆత్మస్థైర్యంతో,   అకుంఠిత దీక్షతో దానిని జయించిన మేటి శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అనడంలో   సందేహం లేదు.

స్టీఫెన్ హాకింగ్ జీవితం.. శాస్త్ర సాంకేతిక రంగంలోనే ఒక చారిత్రక విప్లవం అనడం   అతిశయోక్తి కాదు...