మాతృత్వం స్త్రీలకు దేవుడిచ్చిన వరం. ప్రసవం అంటే స్త్రీలకు పునర్జన్మ అని భావిస్తారు.

వైద్యశాస్త్రం మంచి ప్రగతిని సాధించిన ప్రస్తుత కాలంలో కూడా లక్షలాది తల్లులు ప్రసవం సమయంలో మరణిస్తూనే వున్నారు.

అలా జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి..అవగాహన పెంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉంది..

అదే.. ఏప్రిల్ 11న జరుపుకునే జాతీయ‌ సుర‌క్షిత మాతృత్వ  (Motherhood)దినోత్స‌వం

గర్భిణీలు, పాలిచ్చే మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సౌకర్యాల గురించి అవగాహన పెంచడమే ఈ Motherhood దినోత్స‌వం ముఖ్యోద్దేశం.

జాతీయ గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు మహిళల సరైన ఆరోగ్య సంరక్షణ మరియు ప్రసూతి సౌకర్యాల గురించి అవగాహన పెంచడానికి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ప్ర‌క‌టిం టించిన మొద‌టి దేశం భార‌త్‌.

శాంతికి చిహ్న‌మైన భార‌త్ నేష‌న‌ల్ మ‌ద‌ర్‌హుడ్ డేను ప్ర‌క‌టించిన మొట్ట‌మొద‌టి దేశం.

గ‌ర్భ‌ధార‌ణ‌, ప్ర‌స‌వానంత‌రం మ‌హిళ‌ల‌కు ఆరోగ్య విష‌యాల్లో స‌రైన సౌక‌ర్యాలు, అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు.

2003లో  మొట్ట‌మొద‌టిసారిగా  Motherhood దినోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు.