రోజులో క‌నీసం గంట‌సేపు న‌డిస్తే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

బ‌రువు పెర‌గ‌టాన్ని ప్రోత్స‌హించే జ‌న్యువుల ప్ర‌భావాల‌ను న‌డ‌క తిప్పికొడుతుంది.

న‌డ‌క‌తో తీపి ప‌దార్థాల మీదికి మ‌న‌సు మ‌ళ్ల‌ట‌మూ త‌గ్గుతుంది. 

న‌డ‌క‌తో రొమ్ము క్యాన్స‌ర్ ముప్పు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

కీళ్ల‌వాపుతో త‌లెత్తే నొప్పులు త‌గ్గ‌డానికి న‌డ‌క దోహ‌దం చేస్తుంది.

వారానికి క‌నీసం ఐదారు కిలోమీట‌ర్లు న‌డిస్తే కీళ్ల వాపు నివారించొచ్చు.

కీళ్లు ఒరుసుకుపోవ‌టం త‌గ్గి, క‌ద‌లిక‌లు సాఫీగా సాగుతాయి.

న‌డ‌క‌తో రోగ‌నిరోధ‌క శ‌క్తిసైతం పుంజుకుంటుంది.

20 నిమిషాల‌సేపు న‌డిస్తే జ‌లుబు, ప్లూ వంటి ఇన్‌ఫెక్ష‌న్ల ముప్పు 43శాతం త‌క్కువ‌గా ఉంటుంది

ఒక‌వేళ జలుబు వ‌చ్చినా ల‌క్ష‌ణాలు తీవ్ర‌త త‌క్కువగా ఉండి త్వ‌ర‌గానూ కోలుకుంటారు.