ప్రపంచంలోనే అతి ఎత్తయిన శివుడు విగ్రహం రాజస్థాన్‌లో నెలకొల్పారు.
రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారా పట్టణంలో ఈ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 369 అడుగులు ఉంటుంది.
దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది.
20 కిలోమీటర్ల దూరం నుంచి ఈ శివుడి విగ్రహం కనిపిస్తుంది.
ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటుచేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు.
విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు.
విగ్రహ నిర్మాణం కోసం పదేళ్లు పట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు 2012 ఆగస్టులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శంకుస్థాపన చేశారు.
250 కిలోమీటర్ల వేగంతో శక్తివంతమైన గాలులు వీచినా చెక్కుచెదరనంత బలంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం చేపట్టారు.
ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి ఎత్తయిన శివుడి విగ్రహంగా నేపాల్‌లోని కైలాసనాథ మహదేవ విగ్రహం ఉంది.
ఈ విగ్రహం ఎత్తు 143 అడుగులు. 2011 జూన్ 21న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.