ఈ ప్రపంచంలో చిత్రమైన, అరుదైన పండ్లు ఉన్నాయి...  వీటిలో కొన్ని పండ్లనైతే.. చాలామంది తినటమే కాదు చూసి కూడా ఉండరు..  ఒకవేళ చూసిన వాటిని ఎలా తినాలో కూడా తెలియదు...  ఇదసలు పండేనా అనిపించే ఓ అరుదైన పండు గురించి తెలుసుకుందాం..

‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’..పసుపు పచ్చ రంగులో బంగారు రంగులో మెరిసిపోయే ఈ పండుని అదృష్ట పండుగా భావిస్తారు.

‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’ తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది..ఈ పండుని బుద్ధుడి చెయ్యితో పోలుస్తారు..

మన చింతకాయలు కంటే చాలా చాలా పుల్లగా ఉంటుందీ ‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’

ఈ పండులో గుజ్జు ఉండదు..రసం కూడా ఉండదు..కానీ చింతకాయలు కంటే చాలా చాలా పుల్లగా ఉంటుందీ ‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’

దీన్ని తినేవాళ్లు తక్కువ మంది ఉంటారు. ‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’ చక్కటి సువాసన ఇస్తుంది.. రూమ్‌లో డెకరేషన్ గా పెట్టుకుంటే చక్కటి సువాసనలు వెదజల్లుతుంది..అందుకే దీన్ని ఎక్కువగా  డెకరేషన్ కోసమే కొంటారు.

చైనాలో ‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’ని  అదృష్ట పండుగా భావిస్తారు.

జపాన్‌లో దీన్ని న్యూ ఇయర్ గిఫ్టుగా ఇస్తారు.

‘బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్’ చెట్లు ఎండ బాగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతాయి..

మనకు నిమ్మకాయలు, నారింజలు కాసే సమయంలోనే...  ఈ పండు చెట్టు  పూతపూస్తుంది..