ఈ వారం థియేటర్స్ లో రానున్న సినిమాలు ఇవే..

రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన 'ధమాకా' సినిమా డిసెంబర్ 23న థియేటర్స్ లోకి రానుంది.

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన '18 పేజెస్' డిసెంబర్ 23న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

విశాల్ హీరోగా వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లాఠీ' సినిమా పాన్ ఇండియా వైడ్ డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

నయనతార మెయిన్ లీడ్ లో నటించిన హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్' సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కేవలం 90 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాకి ఇంటర్వెల్ లేకపోవడం విశేషం.

రణ్‌వీర్‌ సింగ్‌, పూజాహెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సర్కస్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది.