ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

అల్లరి నరేశ్, ఆనంది జంటగా కొత్త డైరెక్టర్ ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా నవంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

తమిళ్ లో రీసెంట్ గా రిలీజై సెన్సేషనల్ హిట్ అయిన యూత్ ఫుల్ మూవీ ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 5 కోట్లతో నిర్మించగా 50 కోట్లు కలెక్ట్ చేసి షాకిచ్చింది. దీన్ని తెలుగులో దిల్ రాజు అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 25న థియేటర్స్ లో లవ్ టుడే రానుంది.

వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘భేడియా’. తెలుగులో ‘తోడేలు’ పేరుతో నవంబర్ 25న అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.

‘అశ్వద్థామ’ చిత్రానికి రచయితగా పనిచేసిన పరశురాం శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రణస్థలి’ సినిమా నవంబరు 26న థియేటర్‌లలో విడుదల కానుంది.