‘టీ’ల్లో వెరై‘టీ’లు ఎన్నో..టీ తాగితే హెల్త్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ వెరై‘టీ’స్.. వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

గ్రీన్ టీ: వెయిట్ లాస్ కు బెస్ట్. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయి క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్లాక్ టీ :  ఒత్తిడి కంట్రోల్ చేస్తుంది. హార్ట్ అటాక్స్ రిస్క్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్నిస్తుంది. ఎముకల బలాన్నిస్తుంది.

ఊలాంగ్ టీ : మెంటల్ అలర్ట్‌నెస్ పెంచుతుంది.  పంటి ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బుల నుంచి బయటపడేస్తుంది. ఓస్టియోపోరోసిస్ లక్షణాలు కూడా కంట్రోల్ చేస్తుంది.

చామోమైల్ టీ : కడుపులో నొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. మైండ్ ను ప్రశాంతంగా ఉంచుతుంది. ఇన్‌సోమ్నియా, మైగ్రేన్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

లావెండర్ టీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే అనేక రుగ్మతల్ని తొలగిస్తుంది. ఒక క్రిమినాశనిగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే అన్ని చెడు పదార్ధాలను దూరంగా చేస్తుంది.అన్ని రకాల చెడు బ్యాక్టీరియాను చంపుతుంది.

అల్లం టీ : గొంతులో నొప్పి, దగ్గుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చికాకు, మలబద్ధకం నుంచి రిలీఫ్ ఇస్తుంది. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.అధిక బరువుని తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.

మందార, బ్లూ పీ బటర్‌ఫ్లై ‘టీ’ చర్మానికి చాలా మంచిచేస్తాయి..

పుదీనా, అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

పుదీనా టీ : వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.పుదీనా టీ తాగడం వల్ల చర్మం లోపలి నుంచి మెరుపునిస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది