బీచ్‌ అనగానే విశాలమైన సముద్రం, ఇసుక తిన్నెలు,? అలవోకగా వచ్చిపోయే అలలు కనిపిస్తుంటాయి.

బీచ్ ఆరుబయట కాకుండా ఓ బిల్డింగ్‌ లోపల ఇమిడిపోతే.. ! ఇండోర్‌లోకి వచ్చేస్తే! ఇదిగో ఇలా అందంగా..అద్భుతంగా ఉంటుంది కదూ..

బ్రిటన్‌లో అచ్చం ఇలాగే  ఇండోర్‌ బీచ్‌ ఒకటి సిద్ధమవుతోంది..!

బీచ్‌ మాత్రమే కాదు.. మినరల్‌ బాత్‌లు, స్టీమ్‌ రూమ్‌లు, వేడి నీటి బుగ్గలు.. అబ్బో చూడముచ్చటైన చాలా అందాలు జతకూడనున్నాయి.  ఇండోర్ బీచ్‌ లో..

బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో..ఈ ఇండోర్  బీచ్‌కు ‘థర్మ్‌ మాంచెస్టర్‌’ అని పేరు పెట్టారు..

ఈ ఇండోర్ బీచ్ ఖర్చు రూ.2,500 కోట్లు..

ప్రత్యేక సదుపాయలతో 2025 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

28 ఎకరాల వైశాల్యంలో..ఇండోర్ బీచ్ నిర్మాణం..అంటే 19 ఫుట్‌ బాల్‌ పిచ్‌ల వైశాల్యమంత ఉంటుంది...

ఇండోర్, ఔట్‌డోర్‌ పూల్స్, 35 వాటర్‌ స్లైడ్స్, స్టీమ్‌ రూమ్స్, విశ్రాంతి తీసుకోవడానికి తాటి చెట్లు ఏర్పాటు చేయనున్నారు.

గులాబీ పువ్వు ఆకారంలో వెల్‌ బీయింగ్‌ గార్డెన్‌ను రెండెకరాల్లో రెడీ చేయనున్నారు.

వందలాది చెట్లు, మొక్కలను పెంచనున్నారు... పెద్దల కోసం వేడి నీటి బుగ్గలు, మినరల్‌ బాత్, స్టీమ్‌ రూమ్స్‌ సిద్ధం చేయనున్నారు.

బార్లు, కేఫ్‌లు, స్నాక్స్‌ అందించే రెస్టారెంట్లు కూడా ఉంటాయి..

నీటి సంబంధమైన ఫిట్‌నెస్‌ క్లాసులు, యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు...