శరీరంలో బరువు పెరుగుతుంటే మనస్సులో బెంగ పెరుగుతుంది..

కొన్ని పండ్లలో పీచు, పెక్టిన్‌ అధికంగా ఉండి కొవ్వును కరిగించేందుకు పని చేస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి..

బరువు తగ్గాలని చూసేవారికి కొన్ని రకాల పండ్లు తింటే చక్కటి ఫలితం ఉంటుంది.. మరి ఆ పండ్లు ఏంటో చూసేద్దాం..

పుచ్చకాయ: పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. దీంట్లో ఉండే అర్జినైన్ అనే అమినో యాసిడ్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది...

జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఆప్షన్.

పియర్ : నెమ్మదిగా జీర్ణమయ్యే పియర్‌ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది..

బ్లూ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే బ్లూ బెర్రీస్ రెగ్యులర్‌గా తింటే బరువు త్వరగా తగ్గిపోతారు..

నారింజ పండు బరువు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు.

ఆపిల్: యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తుంది.

రేగు పండ్లలో  పోటాషియం, మ్యాంగనీస్, విటమిన్లు ఎ, సి, కె వంటి పోషకాలు ఉన్నాయి. రేగు పండ్లు కొవ్వును తగ్గిస్తాయి..

కివీ పండు : కేలరీలు తక్కువగా..  ఫైబర్ అధికంగా ఉండే పండు. బరువు తగ్గేవారికి చాలా బెస్ట్ ..

ప్రతీ రోజు పండ్లు తింటే ..కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడతాయి..