సీఎం అయ్యాక రెండో పెళ్లి చేసుకుని మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌

దగ్గరి బంధువు డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది.

CM అయ్యాక తోడు కావాలనిపించిందేమో.. రెండో పెళ్లి చేసుకుని మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్

CM భగవంత్ మాన్ వివాహానికి ఆప్ చీఫ్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబంతో సహా హాజరయ్యారు..నూతన దంపతులను ఆశీర్వదించారు

ఇలా రెండో పెళ్లి చేసుకున్న సీఎంలు గతంలో పలువురు ఉన్నారు..రెండో వివాహాలు చేసుకున్న సీఎంలు ఎవరో చూద్దాం..

ఇలా రెండో పెళ్లి చేసుకున్న సీఎంలు గతంలో పలువురు ఉన్నారు..రెండో వివాహాలు చేసుకున్న సీఎంలు ఎవరో తెలుసుకుందాం..

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి 1986లోనే కుమారస్వామికి వివాహం అయింది. ఆ తర్వాత 2006లో కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ కు తొలి సీఎంగా ప్రమాణం చేసి ఏడేళ్లపాటు సీఎంగా ఉన్న వీర్‌భద్ర సింగ్‌ మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్‌ యువరాణి) అనారోగ్యంతో మరణించాక 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు..

హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి చందర్‌ మోహన్‌ పదవిలో ఉన్నప్పుడు ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నారు. భార్య సీమా భిష్ణోయ్‌ అనుమతితో..చాంద్‌ మొహమ్మద్‌, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు.

అస్సాం మాజీ సీఎం ప్రఫుల్లా కుమార్‌ మహంతా సీఎంగా ఉన్నప్పుడే 1988లో జయశ్రీ గోస్వామి మహంతను వివాహం చేసుకున్నారు.  అయితే..అసెంబ్లీ సెక్రటేరియెట్‌ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.