మెదడుకు హాని కలిగించే అలవాట్లు

శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో మెదడు ఒకటి. 

మనం నిత్యం చేసే పనులు మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 

కొన్ని చెడు అలవాట్ల వల్ల మెదడు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం.

తగినంత నిద్రలేకపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోతుంది.

దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. 

ఏకాగ్రత సామర్థ్యంపై ప్రభావం పడుతుంది.

జంక్ ఫుడ్, కెఫిన్ పదార్థాలు మెదడుకు హాని కలిగిస్తాయి.

స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యం తగ్గుతుంది.

అధికంగా ఒత్తిడికి గురవడం వల్ల మెదడులో వివిధ రకాల హార్మోన్లు ఉత్పత్తై మెదడు కణాలను దెబ్బతీస్తాయి.

వ్యాయామం చేయని వారిలో మెదడు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.