ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారంతో..కడుపు ఉబ్బరానికి చెక్ పెట్టొచ్చు..
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి..
నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయలను మన ఆహారంలో చేర్చుకుంటే.. జీర్ణ శక్తి మెరుగవుతుంది..కడుపుబ్బరం తగ్గుతుంది..
యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలున్న అల్లం చాలా మంచిది. దీంట్లో జింజిబైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపర్చుతాయి. వంటల్లో, డ్రింక్స్ లో అల్లంను చేర్చుకోవాలి..
అరటి పండ్లలో ఫైబర్ తోపాటు పొటాషియం ఎక్కువ. తరచూ కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఈ రెండూ మంచి ఉపశమనం కలిగిస్తాయి.
పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా ఎదుగుదలకు తోడ్పడుతాయి. జీర్ణ శక్తి పెరిగి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.
ఓట్స్ లో ఉండే అధిక ఫైబర్ బాగా పనిచేస్తుంది.జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాల్లో ఆహారం ఆగిపోకుండా.. వేగంగా క్లియర్ కావడానికి ఫైబర్ దోహదం చేస్తుంది.
శరీరంలో జీవ క్రియలు
సమర్థవంతంగా కొనసాగడానికి
గ్రీన్ టీ దోహదం చేస్తుంది.
జీవ క్రియలు సమర్థవంతంగా
కొనసాగితే కడుపు ఉబ్బరం సమస్యే ఉండదు.
నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గించేందుకు దోహదపడతాయి. వీటిలోని పోషకాలు మంచి జీర్ణశక్తికి తోడ్పడతాయి.
పాల కూర, క్యాబేజీ, లెట్యూస్ వంటి వాటిలో ఫైబర్, పలు రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయని.. అవి జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను పోగొట్టి, కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.