మనం ఆహారాల్లో వినియోగించే కొన్ని రకాల పదార్ధాలతోనే  శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను సులభంగానే కరిగించుకోవచ్చు.

కొవ్వును కరిగించే పదార్ధాలేంటో  తెలుసుకుందాం..

కరివేపాకు : కరివేపాకులో ఉండే పోషకాలు శరీరంలోని వ్యర్ధాలను దూరం చేస్తాయి. చెడు కొవ్వుని కరిగిస్తాయి.

ఊబకాయంతో బాదపడే వారు రోజు పది కరివేపాకు ఆకులను నీళ్లలో కలిపి తీసుకోవాలి. లేదంటే ఉదయాన్నే నమిలితే శరీరంలోని కొవ్వులు కరిగుతాయి..

వెల్లుల్లి :  వెల్లుల్లి కొవ్వులు త్వరగా కరిగించటంలో సహాయపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, సల్ఫర్ గుణాలు కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.

తేనె :  శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంతోపాటు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది తేనె. అదనపు కొవ్వులను కరిగిస్తుంది.

గ్లాసు గోరు వెచ్చని నీటిలో స్పూను తేనె వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చిమిర్చి : పచ్చి మిర్చిలోని పోషకాలు హాని చేసే కొవ్వులను కరిగిస్తాయి. డైటింగ్ చేసే వారు కూరల్లో కారానికి బదులుగా పచ్చి మిర్చి వాడితే మంచిది.

దాల్చిన చెక్క :  జీవక్రియల రేటును మెరుగు పరచటంలో దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే .. పోషకాలు శరీరంలోని  కొవ్వును కరిగించటానికి దోహదం చేస్తాయి.  జీర్ణ వ్యవస్ధకు  మేలు కలిగిస్తాయి.